

జనం న్యూస్ ఆగస్టు 16 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
శ్రీ కృష్ణాష్టమి పురస్కరించుకొని 84 వ వార్డు గొల్లవీధిలో యాదవ సంక్షేమ సంఘం నాయకులు బోడి వెంకటరావు కృష్ణుని విగ్రహాన్ని పుర వీధుల్లో ఊరేగించడానికి ఏర్పాటుచేసిన కార్యక్రమాన్ని మాజీ శాసన మండలి సభ్యులు బుద్ధ నాగ జగదీశ్వరరావు ఊరేగింపును ప్రారంభించారు. ఈ సందర్భంగా నాగ జగదీష్ మాట్లాడుతూ శ్రీకృష్ణుని ఆశీస్సులు ఎల్లవేళలా మీ కుటుంబానికి ఉండాలని మీ కుటుంబాల్లో ఆనందం చేకూర్చాలని కోరుకుంటున్నానని అన్నారు ఈ కార్యక్రమంలో కోట్ని రామకృష్ణ బొట్ట చిన్ని యాదవ్ కుప్పిలి జగన్ కాండ్రేగుల సత్యనారాయణ బర్నికాన శ్రీనివాసరావు బొబ్బిలి గోవింద్ రేబాక లోవరాజు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని ఊరేగింపుని విజయవంతం చేశారు.//