Listen to this article

జనం న్యూస్ జనవరి 26 అశ్వరావుపేట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నియోజకవర్గ ప్రతినిధి ఎం నాగేశ్వరరావు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గంలోని 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వివిధ శాఖల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి, ఉత్తమ సేవలందించిన పలువురు అధికారులు, సిబ్బందికి కలెక్టర్, ఉన్నతాధికారులు పురస్కారాలు అందించారు. దమ్మపేట మండల కార్యాలయ సీనియర్ అసిస్టెంట్‌ మాళోతు కుమారి కలెక్టర్ జీతేష్ వి పాటిల్, ఎమ్మెల్యే కోరం కనకయ్య చేతుల మీదుగా ఉత్తమ ఉద్యోగి అవార్డు అందుకున్న సందర్బంగా అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అవార్డు అందుకున్న కుమారికి ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు తోటి సిబ్బంది అభినందించారు.