

జనం న్యూస్ 18 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
మెంటాడ మండలం కొండలింగాలవలస పంచాయతీ పరిధిలోని రెడ్డివాణివలసలో ఆదివారం తెల్లవారుజామున పోలీసులు అక్రమ నాటు సారా తయారీపై గట్టి దాడి చేపట్టారు. గజపతినగరం సీఐ రమణ నేతృత్వంలో ప్రత్యేక బృందం నిర్వహించిన కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లో నాటు సారా తయారీకి వాడే స్థావరాలను ధ్వంసం చేశారు.దాడిలో వెయ్యి లీటర్ల ముడి సరుకు, ముప్పై లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకుని, నాటు సారా తయారీ మట్టికల్లు, భాండాలను కూడా ధ్వంసం చేశారు.అక్రమంగా నాటు సారా తయారుచేస్తున్న ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని ఆండ్ర ఎస్సైకె సీతారాం వెల్లడించారు.అక్రమ మద్యపానాన్ని అరికట్టేందుకు ఇటువంటి దాడులు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు హెచ్చరించారు