

జనం న్యూస్ ఆగస్టు 18 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన
దక్షిణ కాశీగా పేరుపొందిన కుండలేశ్వరం పుణ్యక్షేత్రాన్ని ఏపీ బీజేపీ నాయకులు డాక్టర్ ఏలూరి రామచంద్ర రెడ్డి కుటుంబ సభ్యులతో సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు,ఆయనకు ఆలయ ప్రధాన అర్చకులు కాళ్లకూరి కామేశ్వర శర్మ ఆలయ విశిష్టతను వివరించి వేద ఆశీర్వచనం చేసి శాలువ కప్పి సత్కారం చేశారు,డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా భారతీయ జనతా పార్టీ కోశాధికారి గ్రంధి నానాజీ ఆధ్వర్యంలో స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఏపీ బీజేపీ నాయకులు డాక్టర్ ఏలూరి రామచంద్ర రెడ్డి సూచించారు,ప్రధాని మోదీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు,మోదీ దేశ రక్షణ,అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారన్నారు.రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకొని ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు.
