Listen to this article

జనం న్యూస్ ఆగస్టు 18 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన

కాట్రేనికోన మండలం చెయ్యేరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్రా బీసీ సెల్ సెక్రెటరీ బాలు యాదవ్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తమ ఆరాధ్య కుల దైవం శ్రీకృష్ణ పరమాత్ముడు జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడంతో స్థానిక యువకులు రక్తదానం చేయగా, పలువురు బాలు ప్రయత్నాన్ని అభినందించారు. ఉదయం శ్రీకృష్ణ పూజతో మొదలైన వేడుకలలో చిన్నారులు ప్రదర్శించిన మురళి కోలాటం భక్తులను మంత్రముగ్దలను చేసి విశేషంగా ఆకట్టుకుంది. ఈ వేడుకల్లో ఈ వేడుకల్లో కాట్రేనికోన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నడింపల్లి సుబ్బరాజు, చెయ్యేరు సొసైటీ అధ్యక్షులు చవటపల్లి శ్రీను, చెయ్యేరు సర్పంచ్ చెల్లి సురేష్, ఉపసర్పంచ్ నారాయణ మూర్తి (సియం), నంద్యాల వెంకన్న బాబు బిజెపి నాయకులు గ్రంధి నానాజీ మట్ట సూరిబాబు మట్ట శివకుమార్
జిల్లా యాదవ్ సంఘం గౌరవ అధ్యక్షులు కోరశిఖ సుబ్రహ్మణ్యం మాస్టారు, మట్టా రాంబాబు, జిల్లా మీడియా సెల్ అధ్యక్షులు కానుబోయిన దుర్గాప్రసాద్, కోరిశిఖ రాము తదితరులు పాల్గొన్నారు.