

జనం న్యూస్ 27 జనవరి కోటబొమ్మాళి మండలం:: పీజే ప్రొడక్షన్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న కన్నీరు ఓటిటి మూవీ యూనిట్ సోమవారం కోటబొమ్మాళిలో షూటింగ్ నిర్వహించి సందడి చేశారు. రావివలస ఎండల మల్లికార్జున స్వామి ఆలయంలో కన్నీరు ఓటీటి చిత్రం ముహూర్తం షాట్ ఘనంగా నిర్వహించామని చిత్ర దర్శకులు కాళ్ల అర్జున్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనది కోటబొమ్మాళి మండలం కన్నెవలస గ్రామమని, ఈ సినిమా షూటింగ్ కోటబొమ్మాళి మండలంలో షూటింగ్ చేయటం జరుగుతుందని, ఈ ప్రాంతానికి చెందినవారు ఇందులో నటించనున్నారని ఆయన తెలిపారు. ఈ చిత్రానికి ప్రొడ్యూసర్‌గా పిజె ప్రొడక్షన్, ప్రొడక్షన్ మేనేజర్‌గా పంగా త్రినాధ్, డిఓపిగా రాజేష్ మేడిశెట్టి, నారా ప్రసాద్‌లు వ్యవహరించారని ఆయన తెలిపారు.