Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్ట్ 18 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955

రాష్ట్రవ్యాప్తంగా బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు బందెల గౌతం కుమార్ పిలుపుమేరకు పల్నాడు జిల్లా అధ్యక్షులు బూదాల బాబురావు ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది బీసీలకు వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో 50% శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు మెమోరండం ఇవ్వడం జరిగింది. అనంతరం పల్నాడు జిల్లా అధ్యక్షులు బాబురావు మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీలు బీసీలను మోసం చేస్తున్నాయని బీసీలకు రాజ్యాధికారం బహుజన్ సమాజ్ పార్టీ ద్వారానే సాధ్యమని అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు కంభంపాటి నాగ వంశీ వేల్పుల రాంబాబు సత్తెనపల్లి అధ్యక్షులు దేవానంద్ కోటేశ్వరావు మల్లేశ్వరరావు చిలకలూరిపేట నాయకులు రమణయ్య వందనం షేక్ ఆదం సాహెబ్ కుంచాల శ్రీను నమ్మక రమేష్ కాజా సమీర్ బందెల దానేలు నాగరాజు ప్రేమ చందు ప్రసాద్ మరియు పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు