

జనసేన పార్టీ ఉమ్మడి నల్గొండ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ కోట్రా గోవర్ధన్ జనం న్యూస్ అడవిదేవులపల్లి అర్హులైన నిరుపేదలందరికీ రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇల్లు,ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వంటి పథకాలు అందజేయాలని,అధికార పార్టీ నేతలకు కాకుండా అర్హులైన నిరుపేదలకే అందేటట్టు చూడాలని జనసేన పార్టీ ఉమ్మడి నల్గొండ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ కోట్రా గోవర్ధన్ సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.అలాగే రైతులందరికీ రైతు బంధు ఇవ్వాలని,కౌలు రైతులకు ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా సంవత్సరానికి 12,000 ఇవ్వాలన్నారు.కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు చెప్పినటువంటి ఆరు గ్యారంటీలు సక్రమంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.రెండు లక్షల రుణమాఫీ కానీ రైతులకు రుణమాఫీ చేసి ఆదుకోవాలని ఆయన అన్నారు.