Listen to this article

జనం న్యూస్ ఆగస్టు 18:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల

మండల కేంద్రంతో పాటు మండలంలోని తొర్తి గ్రామం తో పాటు పలు గ్రామాల్లో సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి వేడుకలను సోమవారంగౌడసంఘాల ఆధ్వర్యంలో బహుజనలతో కలసి వేడుకలనుఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా గౌడ సంఘ సభ్యులతో సమాజ సేవకుడు మూడ్ దయానంద్ మాట్లాడుతూ.. బలవంతుల పాలనలో ఇబ్బందికి పాలైన సబ్బండా వర్ణాల బాధితులకు విముక్తి కలిగించాడానికి సర్వాయి పాపన్న గౌడ్ తన గౌడ కులావృత్తిని వదిలి పెట్టి పీడిత ప్రజల కోసం పోరు బాట పట్టడనీ అన్నారు.అంతేగాకుండా బహుజన రాజ్యాన్ని ఏర్పాటు చేసిన తోలి బహుజన బిడ్డ అని సబ్బండాల వర్గాల రాజ్యాధికారం కోసం మార్గం చూపిన మహోన్నతుడు అని వారు అన్నారు. జ్యోతిబా పూలే కంటే ముందే సామాజిక న్యాయన్ని ప్రపంచానికి అందించారు. వీరత్వం లో ఏ మాత్రం తీసిపోని ఆయన్ను యువత గుర్తు చేసు కోవాలని ముడున్నర శతాబ్దాల క్రితం రాజ్యాధికారం కోసం కనీసం ఆలోచించని కాలంలో సింహాసనాన్ని అధిష్టించిన బహుజన సింహం నవాబులకు తబే దారులుగా మారిన వారు చేసిన దోపిడి పై తిరుగుబాటు చేసిన ధైర్య శాలి అన్నారు.17 వ శతాబ్దంలో నే తెలంగాణ గడ్డపై పోరు విత్తనాలు నాటిన విప్లవకారుడని ఆయన పొగిడారు. ఈ కార్యక్రమాల్లో పచ్చిమాట్లా హరీష్ గౌడ్, గౌడ యువజన మండల ఉపాధ్యక్షుడు కోలా రంజిత్ గౌడ్, వెంకటేష్ గౌడ్, సుధానవేణి వెంకటేష్ గౌడ్, రాజు గౌడ్, దశ గౌడ్, మూడ్ దయానంద్, అమర్దాస్ గౌడ్, గోవింద్ గౌడ్, మురళి గౌడ్, ప్రసాద్ గౌడ్, సంపత్ గౌడ్, గోవర్ధన్ గౌడ్, నారా గౌడ్, సుమన్ గౌడ్,రాజా గౌడ్, గోడ్కె రవీందర్, సదానంద్, బి.చిన్న,ఫోటో రాము, కే భూమన్న కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు, తొర్తి మాజీ సర్పంచ్ కుండ నవీన్, గంగా ఖుషి, నాగన్న, సాయన్న, గంగన్న, పుట్ట శీను, లచ్చన్న, సభ్యులు పాల్గొన్నారు.