Listen to this article

ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ కె తావు నాయక్ మాట్లాడుతూ

గ్రామంలో పాఠశాల తరగతి గదులు మొత్తం శిథిలావస్థకు చేరుకుందని అన్నారు. గ్రామంలో పాఠశాల బిల్డింగ్ నిర్మించి దాదాపు 50 సంవత్సరాలు అవుతున్న కొత్త బిల్డింగు నిర్మించడంలో ప్రభుత్వం పూర్తిగా ఫలమైందని విమర్శించారు. తరగతి గదులను చూసి పిల్లలు పాఠశాలలో ఎలా చదువుకోవాలని ఏ విధంగా పిల్లలను పాఠశాలకు పంపాలని తల్లిదండ్రులు భయంతో ఆందోళన పడుతున్నారని అన్నారు. అదేవిధంగా ఇప్పుడు వర్షాకాలం కాబట్టి వాన కురుస్తుందని పాఠశాల గదులు ఎప్పుడు కూలిపోతాయని విద్యార్థులు పాఠశాలలో భయంతో చదువుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో చాలామంది ఎస్సీ ఎస్టీ ఎస్టీ బీసీ మైనార్టీ నిరుపేద పిల్లలు ఉన్నారు. కానీ గత సంవత్సరం ఉన్న విద్యార్థుల సంఖ్య కంటే ఈ సంవత్సరము విద్యార్థుల సంఖ్య పెరిగినప్పటికీ చాలామంది తల్లితండ్రులు తరగతి గదులను శిథిలావస్థలు ఉండడంవల్ల తమ పిల్లలను అప్పు చేసి ప్రైవేటు పాఠశాలకు పంపుతున్నారని అన్నారు.అదేవిధంగా వంటగది శిథిలావస్థకు చేరిందని అన్నారు. ఈ సమస్యలపై గతంలో అధికారుల దృష్టికి తీసుకుపోయిన ఎలాంటి ప్రయోజనం లేదని ఆందోళన చెందారు. కావున కొత్తగా 5 తరగతి గదులను మరియు వంట గదులను తక్షణమే నిధులు మంజూరు చేసి పాఠశాల తరగతి గదులను నిర్మించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో విద్యార్థులను విద్యార్థి తల్లిదండ్రులను కలుపుకొని ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మాజీ డివైఎఫ్ఐ జిల్లా నాయకులు ఎస్ చందు నాయక్ ,ఎస్ఎఫ్ఐ మండల ఉపాధ్యక్షులు ఎస్ భాస్కర్ నాయక్, డివైఎఫ్ఐ గ్రామ అధ్యక్ష కుమార్ నాయక్, డివైఎఫ్ఐ కార్యదర్శి బట్టు జంగయ్య ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ నాయకులు రవి ,గణేష్ తదితరులు పాల్గొన్నారు