జనంన్యూస్. 18. సిరికొండ.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ వర్ధంతిను కిడ్స్ పార్క్ స్కూల్లో నిర్వహించారు.ముందుగా చంద్రబోస్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ జాకీర్ హుస్సేన్ మాట్లాడుతూ…భారత స్వతంత్ర సమర వీరులలో అగ్రగన్యుడు, అలుపెరుగని పోరాటంతో ఓటమి ఎరుగని సేవకు తన జీవితాన్ని అంకితం చేసిన మహానేత నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని, అతని జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్ మాస్టర్ సయ్యద్ ఆసిఫ్ పాఠశాల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.


