(జనం న్యూస్ చంటి ఆగస్టు 18)
బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వర్షాలకు సంబంధించి విద్యుత్ వినియోగదారులు , రైతులు తీసుకోవలసిన జాగ్రత్తలు దౌల్తాబాద్ సెక్షన్ అసిస్టెంట్ ఇంజనీర్, *ఆదిత్య* గారు ఈ క్రింది విధంగా తెలియజేస్తున్నారు * తడి బట్టలు, తడి చేతులతో విద్యుత్ తీగలు, స్విచ్‌లను తాకవద్దు.* తడిగా ఉన్న విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, ఎలక్ట్రిక్ తీగలు, ఇతర పరికరాల ను ముట్టుకోకండి. * తడి చేతులతో ఎలక్ట్రిక్ స్విచ్ ఆన్/ఆఫ్ చేయకండి.* ఇళ్లలో తడి నేలపై ఎలక్ట్రిక్ తీగలు, పరికరాలు పడకుండా జాగ్రత్తపడండి* ఇండ్లలో బట్టలు ఆరవేసే జి.ఐ దండెము/ వైర్ల వలన విద్యుత్ వైర్ల లో ఇన్సులేషన్ సరిగ్గా లేకపోవడం వలన దండెములకు విద్యుత్ సరఫరా అయ్యి షాక్ గురయ్యే ప్రమాదం ఉందని, కనుక ప్లాస్టిక్ దండెములను ఉపయోగించాలని , తద్వారా విద్యుత్ ప్రసారం కాకుండా విద్యుత్ ప్రమాదాలను నియంత్రించవచ్చు అన్నారు.* వర్షంలో తెగి పడిన తీగలు, చెట్లపై పడివున్నా, వాహనాలపై పడివున్నా దగ్గరగా వెళ్లవద్దు.* ఇళ్లలో ఎలక్ట్రిక్ పరికరాలు వాడిన తర్వాత స్విచ్ ఆఫ్ చేయడం అలవాటు చేసుకోండి.* వర్షపు నీటితో నిండిన ప్రదేశాల్లో, పొలాల్లో, రోడ్లలో ఉన్న ఎలక్ట్రిక్ లైన్ల దగ్గర తిరగవద్దు.* పిల్లలు ఎలక్ట్రిక్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల దగ్గర ఆడకూడదు.* ఇంటిలో కి వచ్చే లైన్ సరిగ్గా ఉన్నాయో లేదో తనిఖీ చేసుకోండి.* ఎక్కడైనా విద్యుత్ తీగలు తెగి పడివుంటే, వాటిని తాకవద్దు. తెగి పడిన తీగలు, పరికరాలు కనిపిస్తే డిస్ట్రిబ్యూషన్ లైన్ మాన్ కి సమాచారం ఇవ్వండి.* అలాగే ఇంటి ముందు రేకులకు కూడా విద్యుత్ సరఫరా అయ్యే ప్రమాదం ఉందని వివరించారు. కనుక స్థంభం నుండి విద్యుత్ సరఫరా అయ్యే వైర్లను ఎట్టి పరిస్థితుల్లో దండెంలకు, రేకులకు తగలకుండా జాగ్రత్త వహించాలని తెలిపారు.* ఇంటి వైరింగ్ కు సరైన ఎర్తింగ్ చేయండి మరియు నాణ్యమైన ప్లగ్గులు , సెల్ ఫోన్ చార్జర్లను ఉపయోగించండి. వ్యవసాయ మోటార్లకు , గృహాలలో నాణ్యత గల, అతుకులు (joints ) లేని సర్వీసు వైరును మాత్రమే ఉప యోగించండి.* సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి తడి చేతులతో తాకి మాట్లాడం వలన షాక్ కు గురై చనిపోతున్నారు. దయచేసి చార్జింగ్ బంద్ చేసి మాట్లాడవలసిందిగా వినియోగదారులను కోరడమైనది. * ఎవరికైనా పొరపాటున కరెంట్ షాక్ సంభవిస్తే దగ్గరలోని వ్యక్తులు షాక్ కు గురైన వ్యక్తిని రక్షించాలన్న ఆతృతతో ప్రమాదం సంభవించిన వ్యక్తిని ముట్టుకోరాదు. షాక్ కు గురైన వ్యక్తిని వేరు చేయడానికి విద్యుత్ ప్రవహించని (కర్ర, ప్లాస్టిక్ లాంటి) వస్తువులను వాడడమే సరియైన పరిష్కారం.* రైతులు, వినియోగదారులు కరెంట్ పనులను సొంతంగా చేసుకొకూడదని , అర్హత కలిగిన ఎలెక్ట్రిషియన్ తో పనులు చేసుకోగలని విజ్ఞప్తి చేస్తున్నారు. కంటికి కనపడని విద్యుత్ పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు . ప్రతి వైర్లలో కరెంట్ ప్రసారం అవుతుందన్న అవగాహనతో మెలగాలని అన్నారు . ఎటువంటి విద్యుత్ సమస్య తలెత్తిన TGSPDCL డిస్ట్రిబ్యూషన్ లైన్ మాన్ కు సంప్రదించాలని కోరారు.*Doulthabad AE SIR* Ph No *8712471242**దౌల్తాబాద్ లైన్ మాన్ స్టాఫ్**Line Inspector*Name:- *Kistaiah Sir*Ph No *8712471252**Distribution*Vi:-Doulthabad Vi:-LingarajpallyName:- *Rajeshasham* Ph No *8712471253**Distributions*vi:-Thirumalapurvi:-Maleeshampallyvi:-Ahmadnagarvi:-KonapurName:- *Rakesh*Ph No *8712471230**Distributions*Vi:-DommatVi:-GajulapallyName:- *Subash*Ph No *8712471200**Distributions*Vi:-DeepayampallyVi:-Godugupally Vi:-Sheripally BandaramVi:-NarsampetName:- *Ajay* Ph No *8712471195**Distribution*Vi:-PosanpallyVi:-GovindapurVi:-GuvvalegiVi:- UpparipallyVi:-KonayipallyName:- *Prashanth*Ph No *9502902399**Distribution*Vi:-IndupriyalVi:-Mohd ShapurVi:- Lingayapally ThandaName:- *Suresh*Ph No *9951264472**Distribution*Vi:- MachinpallyVi:- Chetla NarsampallyVi:- AppaipallyName:- *K.Ravinder*Ph No *9963891878**Distribution*Vi:-Mubaraspur Vi:-Surampally Vi:-Muthyampet Name:- *Md Nazeer*Ph No *8712403443*


