Listen to this article

జనం న్యూస్ ఆగస్టు 19:నిజామాబాద్ జిల్లా

ఏర్గట్ల మండలం :రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా వెంటనే సీపీ ఎస్ (కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్) రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి అనే డిమాండ్‌తో పి ఆర్ టి యు సంఘం ఆధ్వర్యంలో ధర్నా పోస్టర్ లను ఏర్గట్ల మండల కేంద్రంలో ఆవిష్కరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పి ఆర్ టి యు మండల అధ్యక్షుడు కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ సీపీఎస్ విధానం ఉద్యోగుల సంక్షేమానికి వ్యతిరేకంగా ఉందని ఉద్యోగుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టివేస్తోందని అందువల్ల, పాత పెన్షన్ కు ఎటువంటి ప్రత్యామ్నాయం సీపీఎస్, యు పి ఎస్ విధానాల వల్ల లేదు అని తిరిగి ఓ పి ఎస్ అమలు కావాల్సిందే” అని తెలుపుతూ చట్టసభల్లోకి వెళ్ళిన రాజకీయ నాయకులకు ఒక సంవత్సరం పదవిలో ఉంటే వారికి జీవితాంతం పెన్షన్ ఇస్తున్నప్పుడు ఉద్యోగిగా కొన్ని సంవత్సరాల పాటు వారుఉద్యోగం లో చేసిన సేవకు గుర్తుగా దేశవ్యాప్తంగా కొన్నిరాష్ట్రాలు ఉదా || హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్ , జార్ఖండ్, ఛత్తీస్ ఘడ్ పంజాబ్ సి పి ఎస్ రద్దును అమలుపరిచినట్టే మన రాష్ట్రంలో కూడా ఎన్నికలకు ముందు తమ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా సీపీ ఎస్ రద్దు చేసి 2004 కంటే ముందు ఉద్యోగ,ఉపాధ్యాయులకు ఇచ్చిన విధంగా జీవిత భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేయడం జరిగింది ..lఅలాగే టీచర్ ఎమ్ ఎల్ సి శ్రీపాల్ రెడ్డి మరియు పి ఆర్ టి యు రాష్ట్ర శాఖ, పి ఆర్ టి యు టీస్ కాంటెస్టెడ్ ఎమ్ ఎల్ సి అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో వారిసూచన మేరకు అన్ని జిల్లాల్లో ,మండలాల్లో తేదీల వారీగా కార్యాచరణ కార్యక్రమాలు తెలియజేస్తూ సెప్టెంబర్ 1న హైదరాబాదులో ఇందిరా పార్క్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టబోతున్నామని కావున ఉపాధ్యాయులు ఈ ధర్నాకు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు గటాడి భాస్కర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజేందర్, జిల్లా కార్యదర్శి సాదుల గంగాధర్, మండలమహిళాఉపాధ్యక్షురాలు మమత, మండల కార్యదర్శి ఇమాముద్దీన్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు