జనం న్యూస్ ఆగస్టు 19 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
ఆచార్య ఎన్. జి. రంగా వ్యవసాయ విద్యాలయం, జిల్లా వ్యవసాయ సాంకేతిక సలహా (ఏరువాక) కేంద్రం, అమలాపురం, ప్రధాన శాస్త్రవేత్త మరియు కోఆర్డినేటర్ డా. ఎం. నంద కిషోర్, వ్యవసాయ వనరుల కేంద్రం, ముమ్మిడివరం, ఏ.ఓ., జె. మనోహర్, ది. 19-08-2025 న మండల వ్యవసాయ అధికారి బి. మృదుల కాట్రేనికోన మండలం గ్రా చెయ్యేరూ వేమవరప్పాడు, గ్రామాలలో పర్యటించి ఇటీవల కురిసిన వర్షాలకు నీట మునిగిన వరి పంట పొలాలను పరిశీలించి రైతులకు ఈ క్రింది సూచనలు చేశారు. ప్రస్తుత ఆగష్టు మాసంలో కురుస్తున్న అధిక వర్షాలకు పల్లపు ప్రాంతాలలో వరి పంట ఊడ్చిన దశ నుండి పిలకలు దశలో నీట ముంపుకు గురికావడం జరిగింది. ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసిన ఎం.టి.యు 1318, స్వర్ణ , సంపద స్వర్ణ, రకాలు ఐదు రోజుల వరకు ముంపును తట్టుకుంటాయి. పంట ఊడ్చిన వెంటనే నీట మునిగి మొక్కలు చనిపోయిన ఎడల మనేదలు వేసుకోవాలి.పిలకల దశలో మునిగితే : పిలకల దశలో సాధారణ రకాలు 5 రోజుల వరకు ముంపును తట్టుకుంటాయి. అలాగే ఆకులు పైకి కనిపిస్తూ 30 –40 సెంటీ మీటర్ల నీరు నిలబడే పల్లపు ప్రాంతల్లోని మధ్యస్థ ముంపుని కూడా తట్టుకుంటాయి. అదే ఎం.టి.యు 1232 రకం అయితే 10 – 12 రోజుల పాటు తాత్కాలిక ముంపును కూడా తట్టుకుంటుంది.పిలకలు కట్టే దశలో నీట మునిగిన వరి పొలం త్వరగా పుంజుకోవడానికి, వీలైనంత్త త్వరగా నీటిని తీసివేసి ఎకరానికి 20 కిలోల యూరియా మరియు 10 – 15 కిలోల పొటాష్ అదనంగా వేసుకోవాలి. ఈ వాతావరణంలో ఆశించే తెగుళ్ళ నివారణకు లీటరు నీటికి 1.0 గ్రా. కార్బెన్డిజిమ్ లేదా 2.0 గ్రా కార్బెన్డిజిమ్ మాంకోజెబ్ కలిపి పిచికారీ చేసుకోవాలి. డా. ఎం. నంద కిషోర్ ప్రధాన శాస్త్రవేత్త మరియు కోఆర్డినేటర్ ఏరువాక కేంద్రం, అమలాపురం,




