పేరుకే భూ భారతి చట్టం పనులు శూన్యం బి ఆర్ ఎస్ నాయకులు మహా ధర్నా కార్యక్రమము.
గుడిపల్లి మండలం లోని తహసీల్దార్ ఆఫీస్ ఎదుట రైతులు బి ఆర్ ఎస్ నాయకులు ధర్నాలో బాగంగా భూభారతి చట్టం లో రెవెన్యూ గ్రామాలలో సదస్సులు నిర్వహించి గుడిపల్లి మండలం లోని వచ్చిన దరఖాస్తులు ఆగస్టు 15 తేదివరకు పరిష్కారం చేస్తారని కాలం గడిచిపోయిన ఇంతవరకు వచ్చిన దరఖాస్తులు 487 కి 50 దరఖాస్తులు మాత్రమే పరిష్కారం అయ్యవని మిగతావి ఇంకా ఎప్పుడూ చేస్తారు అని రైతులు బి ఆర్ ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు ఏలుగురీ వల్లపు రెడ్డి,అర్వపల్లి నరసింహ,ఎర్ర గిరి,మహేందర్, వెంకటయ్య,రాంబాబు,శంకర్, సత్యనారాయణ,వెంకట్,రమణమ్మ,పుషమ్మ,రైతులు పాల్గొన్నారు.తహసీల్దార్ మధుహాసిని కొన్ని దరఖాస్తులు పరిశీలన లో బాగంగా ఆలస్యం జరిగింది అని అన్ని దరఖాస్తు పరిష్కారం చేస్తారని చెప్పింది.


