Listen to this article

జనం న్యూస్,ఆగస్టు19,అచ్యుతాపురం:మండలం లోని


అప్పన్నపాలెం జంక్షన్ నుంచి చోడపల్లి మీదగా అనకాపల్లి వెళ్లే మెయిన్ రోడ్డుకి రింగ్ రోడ్డు కోసం భూములు కోల్పోతున్న రైతులు మరియు ఇళ్ల యజమానులతో చోడపల్లి సచివాలయంలో వుడా డిప్యూటీ డైరెక్టర్ చైతన్య, టౌన్ ప్లానింగ్ అధికారి వెంకటేశ్వరరావు సమావేశం నిర్వహించారు.రోడ్డు విస్తీర్ణం వల్ల టిడిఆర్ బాండ్ల వల్ల లాభాలు ఉపయోగాలు గురించి వివరించడం జరిగింది.బాధిత రైతులు అభిప్రాయాలు తెలపాలని కోరారు. ఈ సందర్భంగా రామన్నపాలెం రైతులు మాట్లాడుతూ రోడ్డు ప్లానింగ్ జిరాయితీ పంట పొలాల్లో నుంచి రోడ్డు వేయడం వల్ల రైతులందరికీ నష్టదాయకంగా ఉంటుందని, బంజరు, ప్రభుత్వ భూములు ఉండగా జిరాయితీ భూముల్లో అడ్డంగా రోడ్డు వేయడం వల్ల రైతులు జీవనోపాధి కోల్పోయే అవకాశాలు ఉన్నాయని, రోడ్డు ప్లానింగ్ మార్చాలని రైతులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. చోడపల్లి ఊరు మీదగా రావడం వల్ల ఇల్లు స్థలాలు కోల్పోవడం వలన కుటుంబాలు రోడ్లపాలు అవుతాయని ప్రత్యక్ష న్యాయం చూపించాలని వాపోయారు. 50 అడుగుల కంటే పంటలు పండే భూములను తీసుకోవద్దని, టిడిఆర్ బాండ్లు వద్దు నగదు రూపంలో నష్టపరిహారం ఇవ్వాలని,ఇల్లులు స్థలాలు కోల్పోయిన వారికి ప్రత్యక్ష న్యాయంగా ఇల్లు కట్టించి ఇవ్వాలని, భూములు కోల్పోయిన వాళ్లకి భూములు ఇవ్వాలన్నారు. చోడపల్లి సర్పంచ్ జి భానువెంకట్ బాధిత రైతులు, ఇల్లు యజమానుల తెలిపిన అభిప్రాయాలే నా అభిప్రాయం అని అన్నారు.రైతులకు మద్దతుగా సీఐటీయూ మండల కన్వీనర్ కూండ్రపు సోమునాయుడు మాట్లాడుతూ అధికారులు మినిట్స్ రాసుకొని పై అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ధర్మిరెడ్డి నాయుడుబాబు, లాలం సత్తిబాబు,డి.రఘు, సన్యాసినాయుడు, గోవిందు,సత్యం,కాకి శీను, రమణ,లోకనాథం, అప్పలరాజు, శ్రీను తదితరులు పాల్గొన్నారు