జనంన్యూస్. 19. సిరికొండ. ప్రతినిధి.
నిజామాబాదు రూరల్ నియోజకవర్గం సిరికొండ మండలం లోని చీమన్ పల్లి గ్రామానికి చెందిన సారంపల్లి ప్రసాద్ అనే వ్యక్తి గల్ఫ్ బైరాన్ దేశంలో ఎత్తైన భవనంలో క్లినింగ్ పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు జారీ కిందపడి తీవ్ర గాయాల పాలైన ఘటన. అక్కడ తోటి తెలుగువారు ప్రసాదును ఆస్పత్రిలో చేర్పించి వారి ఇంటికి సమాచారం అందించారు. విషయం తెలుసుకొని. గల్ఫ్ దేశం బైరన్ లో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రసాద్ కు మెరుగైన వైద్యం అందింఛీ కోలుకున్న తర్వాత ఇండియాకు తెప్పించాలని అతని సోదరి నుంగూరి లత. హైదరాబాదులోని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతి రెడ్డి ని. అయన నివాసం నాకు వెళ్లి కలవడం జరిగింది. ఎమ్మెల్యే స్పందించి తెలంగాణ ప్రభుత్వం. గల్ఫ్ లోని బాధితులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చాడు. గ్రామస్తుల తో పాటు జిల్లా ప్రధాన కార్యదరి వెల్మ భాస్కర్ రెడ్డి, చీమనపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు ఏనుగు రాజేందర్ రెడ్డి మరియు బాధితుని కుటుంబ సభ్యులు పాల్గొన్నారు మరియు తదితరులు ఎమ్మెల్యే ని కలిసి వినతి పత్రం అందజేశారు. ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి సానుకూలంగా స్పందించారు.


