Listen to this article

బిచ్కుంద ఆగస్టు 20 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ కార్యాలయంలో భారత దేశ ఐటీ టెలికం రంగాల పితామహుడు దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా బిచ్కుంద మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గంగాధర్ యువ నాయకుడు భాస్కర్ రెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశానికి ఆయన చేసిన సేవలు మరువ లేనివని ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడల్లో నడవాలని పేర్కొన్నారు ఇట్టి కార్యక్రమంలో అధ్యక్షుడు గంగాధర్ తో పాటు మార్కెట్ కమిటీ డైరెక్టర్లు అజయ్ పటేల్, సాయిని అశోక్, సీమ గంగారం టీచర్, మైనార్టీ నాయకుడు ఖలీల్ ,గౌస్ సెట్, నయన్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు లింగరం, ఉత్తం, అశోక్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు