14 మంది రిమాండ్ కు తరలింపు.
వివరాలు వెల్లడించిన ఎస్ఐ.శ్రీధర్ రెడ్డి
జనం న్యూస్. ఆగస్టు 19. సంగారెడ్డి జిల్లా. హత్నూర.
హత్నూర మండల కేంద్రంలోని సాగర్ రావు ఫామ్ హౌస్ లో పేకాట ఆడుతున్నట్లు నమ్మదగిన సమాచారంతో హత్నూర ఎస్ఐ శ్రీధర్ రెడ్డి తన సిబ్బందితో కలిసి సోమవారం రాత్రి ఫామ్ హౌస్ లో పేకాట స్థావరంపై దాడులు నిర్వహించారు.ఈ దాడుల్లో 14 మందిపేకాటరాయుళ్లను అదుపులో కి తీసుకొని వారి వద్దనుండి లక్షా ఎనభైవేల ఆరువందల యాబై1.80.650/) రూపాయలునగదు.13.మొబైల్ ఫోన్లు. హీరోహోండా గ్లామర్ ఒక బైక్.మూడు కార్లు.104. పేకాటముక్కలనుస్వాధీనంచేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని అన్నారు. అదుపులోకి తీసుకున్న 14.మంది పేకాటరాయుళ్ల వివరాలు యాదుళ్ళ మహేందర్ మల్లేష్ హనుమంతు వెంకట్ రెడ్డి,ఉపేందర్ ఖాసీం గోపాల్ సతీష్,రాములు,రాజేందర్. నరేష్,లక్ష్మణ్ నరేష్ లపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరిచినట్లు ఎస్ఐ శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు.



