Listen to this article

జనం న్యూస్, జనవరి 27, బోధన్ నియోజవర్గం బోధన్ పట్టణ పోలీస్ స్టేషన్ పట్టణంలోని పలు గ్రామాలకు చెందిన , పట్టణానికి చెందిన మద్యం తాగి వాహనం నడిపిస్తున్న సంగం గ్రామానికి చెందిన కాంబ్లి గంగా దీపక్ మరియు పట్టణంలోని రెంజల్ బేస్ కు చెందిన కర్రోళ్ల సాయిలు లపై కేసు నమోదు చేసి న్యాయస్థానంలోని సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా ఒకరోజు జైలు శిక్ష విధించినట్లు సీఐ తెలిపారు. రాకాసిపేట్ లో బహిరంగంగా మద్యం సేవిస్తున్న ఇద్దరికీ, అంబేద్కర్ చౌరస్తా లో రోడ్డుపైన పండ్ల బండితో ట్రాఫిక్ అంతరాయం కలిగించిన ఒక వ్యక్తికి సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా వారికి కూడా ఒకరోజు జైలు శిక్ష విధించనట్లు సీఐ తెలిపారు.