Listen to this article

జనం న్యూస్ జనవరి 27 (గోరంట్ల మండల ప్రతినిధి ఫక్రోద్దీన్) శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం ప్రైవేట్ పాఠశాలల సంఘం ఆధ్వర్యంలో ప్రైవేట్ పాఠశాలల క్యాలెండర్లను సోమవారం విద్యాశాఖ అధికారులు జాన్ రెడ్డప్ప, గోపాల్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. పట్టణంలోని ఎమ్మార్సీ భవన్లో విద్యాశాఖ అధికారులతో కలిసి ఆవిష్కరించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి జిల్లా జనరల్ సెక్రెటరీ గౌస్ బాషా మరియు గోరంట్ల ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్లు రామ్మోహన్ లక్ష్మీపతి శ్రీధర్ రెడ్డి అంజన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.