

జనం న్యూస్ జనవరి 27 జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలంలోని కండ్లపెల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఉన్న అంగన్వాడీ సెంటర్ లో పైకప్పు పెచ్చులూడిన వైనం చిన్న చిన్న పిల్లలు అప్పుడప్పుడే అమ్మ ఆవు అంటు చిలుక పాలు కులుతో ముద్దు ముద్దుగా మాట్లాడే బుజ్జాయిలు చిట్టి చిట్టి చేతులతో బలపం పలుక పై ఆక్షారాలు దిద్దే పిల్లలు ఇంట్లో ఉంటే అల్లరి చేస్తారనో స్కూళ్లకు వెళ్లేందుకు అలవాటు పడతరనో పౌష్టికాహారం ఇస్తామని టిచర్ చేప్పిందనో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను అంగన్వాడీ సెంటర్లకు పంపిస్తున్నారు . రెండు గంటల్లో మూడు గంటల్లో అక్కడ మిగితా చిన్నారులతో అడుకుని టిచర్ చెప్పిన ముచ్చట్లు విని పలుక పై పెట్టించిన అక్షరాలు దిద్దుకుని మళ్ళి ఇంటికి వచ్చేస్తుంటారు అలాంటి చిన్నారులకు కేటాయించిన అంగన్వాడీ భవనం ఎంతో అధ్వానంగా ఉంటున్నాయన్న దానికీ ఈఘటనే ప్రత్యక్ష నిదర్శనం ముద్దులొలికే చిన్నారులు ఉండగానే అంగన్వాడీ భవనం పైకప్పు ఒక్కసారి ఉడపెచ్చులూడి పడిపోయింది అంగన్వాడీ టిచర్ అక్కడే ఉండి పిల్లలకు ఎలాంటి అని జరగకుండా ముందుగానే అప్రమత్తంగా పిల్లలని ప్రాణ ప్రాయం నుండి రక్షించిన అంగన్వాడీ టిచర్ పిల్లలను అంగన్వాడీ సెంటర్ కు పంపించడానికి పిల్లల తల్లి తండ్రులు భయాందోళనకు చెందుతున్నారు అంగన్వాడీ సెంటర్ ప్రారంభం చేసి మూడు సంవత్సరాలకే ఇలా అయితే ఎలా అని పిల్లల తల్లి తండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి అంగన్వాడీ సెంటర్ ను బాగు చేయాలని పిల్లల తల్లి తండ్రులు కోరుతున్నారు