Listen to this article

జనం న్యూస్ ఆగష్టు 21(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)

అకాల వర్షాలకు వరి, పత్తి పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ప్రభుత్వ అధికారులను నియమించి పంటలను పరిశీలించి నష్టపరిహారం చెల్లించాలని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి శ్రీరాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.బుధవారం సుందరయ్య భవనంలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి శ్రీరాములు మాట్లాడుతూ అకాల వర్షాలకు నష్టపోయిన రైతాంగానికి ఎకరానికి ఎకరానికి 30 వేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలన్నారు.అట్లాగే వ్యవసాయానికి యూరియా సమస్యను సృష్టిస్తున్న కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు రైతులకు నష్టం కలిగించే విధంగా ఉన్నదని అన్నారు. అధికారులు ఒకపక్క యూరియాకు ఎలాంటి కొరత లేదని అని ప్రకటిస్తూన్న మరో పక్క రైతులు యూరియా కొరకు ధర్నా చేస్తున్నరు. పార్లమెంటులో కూడా పార్లమెంటు సభ్యులు యూరియా కొరకు ధర్నాలు చేస్తున్నారని అన్నారు కేంద్ర ప్రభుత్వం రైతులకు యూరియాను సరియైన సమయంలో అందించకపోతే రైతులు నష్టపోతారన్నారు. కేంద్ర ప్రభుత్వo ఈ వ్యవసాయాన్ని పండుగ చేస్తామని చెప్పి, కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పే భాగంగా వ్యవహరిస్తుందని అన్నారు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం సరియైన మార్గంలో వ్యవహరిస్తూ రైతు సంఘాన్ని అఖిలపక్షాల కమిటీలను సమావేశపరిచి కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాల మీద సమీకరించి రైతులకు కావాల్సిన యూరియా ఎరువుల సమస్యలు పరిష్కరించాలని కోరినారు.ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బచ్చలకూర స్వరాజ్యం, రైతు సంఘం మండల అధ్యక్షులు చందా చంద్రయ్య, మండల కార్యదర్శి దేశీరెడ్డి స్టాలిన్ రెడ్డి, రైతు సంఘం నాయకులు బి కృష్ణారెడ్డి, మల్లారెడ్డి, ఎం వెంకటాద్రి, జి వినోద్, ఎస్ నాగరాజు, కిన్నెర ఎంకన్న, తదితరులు పాల్గొన్నారు