జనం న్యూస్. ఆగస్టు 20. సంగారెడ్డి జిల్లా. హత్నూర.
రానున్న వినాయక చవితి పండుగ సందర్భంగా హత్నూర పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని గ్రామాల్లో వినాయక మండపాల ఏర్పాటుకు నిర్వాహకులు తప్పనిసరిగా ఆన్లైన్ దరఖాస్తు చేసుకొని అనుమతులు పొందాలని హత్నూర ఎస్ఐ శ్రీధర్ రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ వినాయక మండపాల ఏర్పాటుకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని పోలీస్ స్టేషన్లో దరఖాస్తు కాపీ సమర్పించాలన్నారు. ప్రధాన రహదారులపై మండపాలను ఏర్పాటు చేయవద్దని, రహదారులను క్లియర్గా ఉంచాలన్నారు.మండపాల వద్ద విద్యుత్ తీగలను సురక్షి తంగా అమర్చాలని, అగ్నిప్రమాదాల నివారణకు అవసరమైనచర్యలు తీసుకోవాలన్నారు. ఎటువంటి సందేహాలు ఉన్నా హత్నూర పోలీస్ స్టేషన్ నెంబర్ కు 8712656752 ఫోన్ చేసి పూర్తిసమాచారం తెలుసుకోవాలని సూచించారు.అదేవిధంగా పోలీసుల తక్షణ సహాయం కోసం డయల్ 100కి కాల్ చేసి ఉపయోగించుకోవాలని ఎస్ఐ శ్రీధర్ రెడ్డి వెల్లడించారు.


