జనం న్యూస్ 21 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
చిరంజీవి సేవా కార్యక్రమాలు కోట్లాది మంది అభిమానులకు స్ఫూర్తిదాయకమని జనసేన నేత గురాన అయ్యలు అన్నారు విజయనగరం జిల్లా చిరంజీవి యువత, అంజనీపుత్ర చిరంజీవి ప్రజాసేవాసంఘం, బ్లడ్ డోనర్స్ క్లబ్ మరియు అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో..మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వారోత్సవాల్లో భాగంగా ఆరో రోజు (బుధవారం) మెగాభిమానులకు చిరు సత్కారాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గురాన అయ్యలు మాట్లాడుతూ చిరంజీవి ఒక మహానటుడిగా మాత్రమే కాకుండా, తన సేవా కార్యక్రమాల ద్వారా సమాజానికి గొప్పసేవలు అందించారని పేర్కొన్నారు.
సేవా రంగంలో మెగాస్టార్ చిరంజీవి ఎవరెస్టు శిఖరమన్నారు. మెగాస్టార్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్, ఆక్సిజన్ సెంటర్స్‌తో ఎందరో పేద ప్రజలకు మేలు చేస్తున్న చిరంజీవి, నిజమైన సేవా గుణంతో ముందుకు సాగుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. చిరంజీవి నటుడిగానే కాకుండా, మానవతావాదిగా కూడా ఎంతో మంది హృదయాల్లో స్థానం సంపాదించారన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు త్యాడ రామకృష్ణారావు (బాలు),చిరంజీవి యువత ప్రతినిధులు, జనసేన యువనాయకులు పిడుగు సతీష్, లాలిశెట్టి రవితేజ, కొయ్యాన లక్ష్మణ్ యాదవ్,లోపింటి కళ్యాణ్,ఎంటి రాజేష్, అడబాల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.


