ఆందోళన చెందుతున్న రైతన్నలు
జనం న్యూస్,ఆగస్ట్ 21,కంగ్టి,
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని పలు గ్రామాలలో ఆదివారం కురిసిన భారీ వర్షానికి వరద నీటితో వాగులు ఉగ్రరూపం దాల్చి ఉప్పొంగడంతో వాగుల వెంట ఉన్న జంమ్గి కె,జంమ్గి బి,ముర్కుంజల్,డోంగ్ బాన్సువాడ,పీఎం దామరగిద్ద,వాల్మూర్, ఎంపల్లి,శివారులోని పంట చెల్లలో వాగులు పారడంతో రైతుల పంటలు నీటి ప్రవాహంలో కొట్టుకోపోవడం జరిగింది.ఈ సందర్భంగా రైతన్నలు మాట్లాడుతూ దూకి దున్ని భూమి చదును చేసి ఉంచిన వ్యవసాయ భూమిలో వర్ణుడు ఆలస్యంగా కరుణించడంతో వేల రూపాయలు పెట్టుబడి పెట్టి పంటలు సాగు చేసిన కొద్ది రోజుల్లోనే వరుణ దేవుని ఆగ్రహంతో చెరువులు కుంటలు,నిండి వదలడంతో వాగులు ఉగ్రరూపం దాల్చి సైరావిహారంగా ప్రవహించగా ప్రవాహం తాకిడి తట్టుకోలేని పంటలు కొట్టుకుపోయాయని అన్నారు.ఎంతో కష్టపడి పెట్టుబడితో పంటలు వేసిన మా కష్టమంతా నీటిపాలు అయ్యాయని అన్నారు.పంటలపైనే ఆధారపడే రైతన్నలు తమ పంటలు నీట కొట్టుకోపోవడంతో తినడానికి తిండి దొరక్క, పనిచేయడానికి ఉపాధి దొరక్క,పిల్లాపాపలకు పోషించలేక, దయనీయమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. వాతావరణంలో మార్పు రావడంతో వ్యాధుల బారిన పడి కొట్టుమిట్టాడుతున్నామని అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు క్షేత్రస్థాయిలో వర్షానికి పంట నష్టం జరిగిన రైతన్నలకు ప్రభుత్వం ఆదుకోవాలని ప్రభుత్వానికి చేతులెత్తి వేడుకుంటున్నారు.ఈ కార్యక్రమంలో సంతోష్ గిరి,పురం భీమన్న,గొల్ల భూమన్న,గొల్ల సాయిలు,దత్తు రావు, గోవింద్ రావు పాటిల్, సాయిలు,పురం నాగభూషణం,కుమ్మరి లింగం,చాకలి మల్లన్న, గొల్ల సాయిలు,కాస్ప రాజు,పురం అంజన్న, గొల్ల కిష్టప్ప,గొల్ల పండరి, గొల్ల సుభాష్, తదితరులు పాల్గొన్నారు.


