Listen to this article

రైతులకు అందించాల్సిన రైతుబంధు వెంటనే విడుదల చేయాలీ

మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే డిమాండ్

డోంగ్లి ఆగస్ట్ 21 జనం న్యూస్

గత కొంతకాలంగా కురుస్తున్న భారీ వర్షాలకు జుక్కల్ నియోజకవర్గ వ్యాప్తంగా దెబ్బతిన్న పంటలకు వెంటనే పంట నష్టం అంచనా వేసి రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పంట నష్టం అందించాలని మాజీ ఎమ్మెల్యే హనుమన్సెంటే డిమాండ్ చేశారు. గురువారం డోంగ్లి మండలంలోని పలు గ్రామాలలో పర్యటించి దెబ్బతిన్న పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం హయాంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు పంట పెట్టుబడి సాయంగా రైతుబంధును అందించేవారని, 6 గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మాయ ప్రజలకు మాటలు చెప్పి గద్దెనికి రైతులను విస్మరించిందని మండిపడ్డారు. రైతులకు అందించాల్సిన రైతుబంధును నాలుగు సీజన్లకు గాను ప్రతి ఎకరాకు 30 వేల రూపాయలను అందించాల్సి ఉండగా 11 వేల రూపాయలని అందించిందని, మిగతా ప్రతి ఎకరాకు19వేల రూపాయలు రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడిందని, రుణపడి ఉన్న రైతుబంధు మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేయడంతో పాటు వర్షాల వల్ల దెబ్బతిన్న పంట నష్టపరిహారాన్ని కూడా వెంటనే రైతులకు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.అధికారులకు ధన్యవాదాలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే గత నాలుగు రోజుల క్రితం కురిసిన నియోజకవర్గంలోని నిజాంసాగర్, కౌలాస్ నాలా ప్రాజెక్టు లలో ఎగువ భాగం నుండి వరద నీరు వచ్చి చేరడంతో నిజాంసాగర్, కౌలాస్నాల వరద గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. దీంతో బిచ్కుంద మండలంలోని షట్లూరు గ్రామంలో ముగ్గురు గొర్రెల కాపరులు, ఒక రైతు తో పాటు 656 గొర్రెలను ప్రాణాలతో పాటు రక్షించిన అధికారులకు, రెస్క్యూ టీం సభ్యులకి ధన్యవాదాలు తెలిపారు.