Listen to this article

జనం న్యూస్, ఆగస్టు 21, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్

శ్రీకర ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్, ఐ డి ఎ బొల్లారం వారి సౌజన్యంతో అందులో పని చేస్తున్న శ్రీ చేతిరెడ్డి శ్యామ్ రెడ్డి, ఆర్ ఎం డి మేనేజర్ మరియు వెంకట్, సహాయంతో, చేతిరెడ్డి బూపతిరెడ్డి ఉపాధ్యాయులు ప్రాథమిక పాఠశాల పాములపర్తి, మరియు సుధాకర్ రెడ్డి మార్కుక్ చొరవతో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం మార్కుక్ విద్యార్థులకు 220 బ్లాంకెట్లు సుమారు ఎనబై వేల రూపాయల విలువైనవి ఈ రోజు మధ్యాహ్నం వితరణ గావించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి శ్రీ వెంకట రాములు పాల్గొని యెక్క దాతృత్వం కు ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థులు బాగా చదివి అభివృద్ధి చెందాలని సూచించారు. ఇట్టి కార్యక్రమం లో పాఠశాల ప్రత్యేక అధికారి శ్రీ మతి భాగ్యలక్ష్మి, ఉపాధ్యాయినిలు, హరిబాబు సి సి ఓ మరియు పిల్లలు పాల్గొని ధన్యవాదాలు తెలిపారు.