

జనం న్యూస్,ఆగస్టు21అచ్యుతాపురం:
పూడిమడక ఉప్పుటేరులో ఫార్మా పరిశ్రమల నుండి వ్యర్ధాలను విడుదల చేయడంతో ఉప్పుటేరులో మత్స్య సంపద నశించిపోయిందని ఈ ఘటనపై పొల్యూషన్ బోర్డు అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా తూతూ మంత్రంగా పరిశీలించి వెళ్ళిపోతున్నారని, రాత్రి వేళల్లో రహస్యంగా వ్యర్ధాలను లారీ ద్వారా ఉప్పుటేరులో విడుదల చేసి వెళ్ళిపోతున్నారని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు.ఈ సమస్యను అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకుని వెళ్లినా ప్రయోజనం ఉండటం లేదని,ఉప్పుటేరులో మరోసారి చేపలు చనిపోతే మత్స్యకారులు భారీ స్థాయిలో ఉద్యమం చేయడం జరుగుతుందని వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి ఉమ్మడి జగన్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మిడి అప్పారావు,వై శ్రీను, దూడ మసేను,దేవుడు, అచ్చయ్య, అప్పలరాజు, పోలయ్య తదితర మత్స్యకారులు పాల్గొన్నారు.