జనం న్యూస్ 22 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
విజయనగరం శుద్ధ వీధిలోని ఓ ఇంటిలో పేకాట ఆడుతున్న ఏడుగురిని అరెస్టు చేసినట్లు టూ టౌన్ సీఐ టి.శ్రీనివాసరావు బుధవారం తెలిపారు. ఎస్.బంగారునాయుడు ఇంట్లో పేకాట ఆడుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు సిబ్బందితో కలిసి దాడి చేశామన్నారు. రూ.48,810 నగదు, 8 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని ఏడుగురిపై కేసు నమోదు చేశామన్నారు. కాగా వీరిలో పలువురు వైసీపీ నేతలు ఉన్నట్లు సమాచారం.


