Listen to this article

జనం న్యూస్ఆగస్టు 22 కాట్రేనికోన

ఆకొండికి సినారే, దాశరథి 2025 పురస్కారం. తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ మరియూ ఇందిర ఆర్ట్స్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రకటించిన సినారే మరియు దాశరథి ఎక్స్ లెన్స్ అవార్డు 2025 ఎలైడ్ ఆర్టిస్టు ఆడిటోరియం, హిమాయత్ నగర్ వేదికగా హైదరాబాదులో కాట్రేనికోనకు చెందిన ప్రముఖ వాస్తు జ్యోతిష సిద్ధాంతి, సామాజిక, సాహితీ సేవకుడు, ఫ్రెండ్లీ క్లబ్ వ్యవస్థాపకుడు ఆకొండి నాగరవీంద్ర జోగయ్య శాస్త్రికి ఘనంగా సత్కరించి పురస్కారం అందచేసారు. ఈ సందర్భగా గౌరవ అతిధిగా సీనియర్ సినీనటుడు డా. చింతకుంట మాణిఖ్య రావు, గౌరవ అధ్యక్షురాలు డా.పి.వి.పి.అంజనీకుమారి, అధ్యక్షురాలు, ఫౌండర్ డా.ఎన్. ఇందిర, ఉపాధ్యక్షుడు డా.ఆలూరి విల్సన్, విశిష్ట అతిథి డా. రామకృష్ణ చంద్రమౌళి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫ్రెండ్లీక్లబ్ సభ్యులు, పలువురు అభిమానులు ఆకొండికి అభినందనలు తెలియజేసారు.