

రాజకీయ అనుభవం కలిగిన సీనియర్లును పక్కన పెట్టడం వల్ల పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుంది.
పార్టీలో ఒకరికి ఒకే పదవి అనే సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టండి.
ఏపీ స్టేట్ బ్యూరో, ఆగష్టు 22 (జనం న్యూస్):
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రస్థాయి, జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయిలలో పార్టీకి సంబంధించి వివిధ విభాగాలలో పార్టీ శ్రేణులకు పదవులు ఇస్తున్నారు. కానీ జిల్లా, నియోజకవర్గ స్థాయి, మండల స్థాయిలలో సీనియర్లకు తగిన ప్రాధాన్యత లభించుట లేదని నియోజకవర్గ స్థాయిలో “చర్చ” జరుగుతోంది. పార్టీకి విశేష సేవలు అందించిన మాజీ జడ్పీటీసీ లు, మాజీ ఎంపీపీలు, మాజీ సర్పంచులు, ఇలా వివిధ హోదాలలో పనిచేసే రాజకీయ అనుభవం కలిగినటువంటి నాయకులను జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలలో గౌరవప్రదమైన స్థానాలలో పదవులు ఇవ్వడం వలన పార్టీకి మేలు జరుగుతుందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల, నాయకుల భావన అని చెప్పవచ్చు.నియోజకవర్గ, మండల స్థాయిలలో ముఖ్యంగా సీనియర్ నాయకులను గుర్తించి వారికి గౌరవప్రదమైన వివిధ విభాగాలలో వారికి స్థానం కల్పించడం వలన నియోజకవర్గ సమన్వయకర్తకు అవసరము అయినప్పుడు వారి సలహాలు, సూచనలు, వారి అనుభవాలు, నియోజకవర్గస్థాయిలలో ఉన్నటువంటి పరిచయాలు తప్పక ఉపయోగపడతాయని చెప్పవచ్చు. ఇప్పటికైనా నియోజకవర్గ సమన్వయకర్తలు నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి సీనియర్ నాయకులను తప్పక పరిగణలోకి తీసుకొని ప్రస్తుత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోని వివిధ విభాగాలలో నియోజకవర్గ, మండల స్థాయిలలో, వారిని పార్టీలో భాగస్వామి చేయడం వల్ల పార్టీ బలోపేతం కావడానికి ఎన్నికల సమయంలో వీరి అనుభవం ఉపయోగపడుతుందని నిస్సందేశంగా చెప్పవచ్చు.రాష్ట్రస్థాయి, నియోజకవర్గ స్థాయి, మండల స్థాయిలలో జోడు పదవులు ఇవ్వడం వలన పార్టీలో పూర్తి స్థాయిలో విమర్శలు వస్తున్నాయని గమనించండి.రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలోనైనా ఎవరికైనా రాజ్యాంగ బద్ధమైన స్థానములో ఉన్నవారికి మరల రాష్ట్రస్థాయి, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలలో స్థానం కల్పించే దానికంటే నియోజకవర్గంలో ఉన్నటువంటి బలమైన నాయకులకు పార్టీ విభాగాలలో స్థానం కల్పించడం వల్ల పార్టీకి ఎంతో ప్రయోజనం కలుగుతుందని గమనించండి. పదవులు ఇచ్చే ముందు ఆలోచించండి. నియోజకవర్గ స్థాయిలో అన్ని రకాల విభాగాలలో కొంతమంది సీనియర్లను, ప్రజాధరణ కలిగిన నాయకులను, గ్రామాలలో పట్టు ఉన్న నాయకులను, అన్ని రకాలుగా ఆలోచించి కీలకమైన రాజ్యాంగబద్ధమైన పదవులలో ఉన్నవారికి మరల పదవులు ఇవ్వకుండా నియోజకవర్గ స్థాయిలో ఉన్న వివిధ వర్గాల నాయకులకు స్థానం కల్పించడం వల్ల పార్టీ బలపడుతుందని, పార్టీ బలోపేతానికి కూడా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు.