

జనం న్యూస్, ఆగస్టు 22, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ )
జగదేవపూర్ మండలం లోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన గ్రామ ముదిరాజ్ సంఘం యూత్ అధ్యక్షులు కొంతం మహేష్, అనారోగ్యంతో మృతి చెందాడు విషయం తెలుసుకున్న మండలం ముదిరాజ్ సంఘం అధ్యక్షులు (టీ ఎం పి ఎస్)రాష్ట్ర ఉపాధ్యక్షులు రాగుల రాజు ముదిరాజ్, మండల ముదిరాజు సంఘం యువజన అధ్యక్షులు , (టి ఎం పి ఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హేమ సురేష్ ముదిరాజ్, శుక్రవారం తిమ్మాపూర్ గ్రామానికి వెళ్లి మృతి చెందిన కొంతం మహేష్, భౌతికకాయానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు, మహేష్ కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు,అనంతరం ₹ 5,000/- రూ. లు ఆర్థిక సాయం అందజేశారు, ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒక మంచి వ్యక్తిని కోల్పోయామని అన్నారు. ఆయన కుటుంబానికి అండగా ఉంటామని పేర్కొన్నారు.మాజీ సర్పంచ్ బిక్షపతి, మునిగడప గ్రామ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు స్వామి,ముదిరాజ్ సంఘం యూత్ అధ్యక్షులు యువరాజు, అనంతసాగర్ గ్రామ మాజీ సర్పంచ్ లావణ్య మల్లేశం, ముదిరాజ్ సంఘం నాయకులు కిషన్,రామచంద్రం,సుధాకర్,తదితరులు పాల్గొన్నారు.
