Listen to this article

జనం న్యూస్ ఆగస్టు 23 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ

అల్లవరం మండలం బెండముర్లంక గ్రామంలో అల్లవరం మండల అధ్యక్షుడు కట్టా నారాయణమూర్తి ఆధ్వర్యంలో జిల్లా ఇంచార్జ్ పసుపులేటి మహాలక్ష్మి గారు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆగస్ట్ 31 సంచార జాతుల విముక్త జాతుల దినోత్సవం పురస్కరించుకుని సంచార “జాతులం సదాచార వారసులం సంస్కృతుల వారధులం” అనే నినాదంతో భారతీయ జనతా పార్టీ ఈ నెల 30 తేదీన తిరగబోయే సమావేశం విజయవాడ వెన్యూ ఫంక్షన్ హల్ వద్ద సంచార సమాజాన్ని స్ఫూర్తిప్రధాతలుగా తెలుపుతూ “స్ఫూర్తి” కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ పిలుపుతో రాష్ట్రంలో సంచార కులాల పెద్దలను బిజెపి ఆహ్వానిస్తుంది జాతీయ నాయకులు కేంద్ర మంత్రులు అతిథులుగా పాల్గొనే ఈ కార్యక్రమం ద్వారా సంచార కులాల వృత్తులు కలలు ప్రదర్శించడం శోభయాత్ర నిర్వహించడమే కాకుండా కళాకారులకు ఉద్యమ నాయకులకు అవార్డు గ్రహీతలకు కళాకారులకు సత్కారాలు వుంటాయని రాష్ట్రంలో ఎన్ టి డి ఎన్ టి సంఘాలు కుల సంఘాలు నాయకులు కుల పెద్దల ఆశీస్సులు వారి సహకారంతో భారతీయ జనతా పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ” స్ఫూర్తి ” కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని సంచార సమాజం సమస్యలు దీర్ఘకాళిక అంశాలపై కూడా రూట్ మ్యాప్ ప్రకటించుకుంటామని తెలిపారు
ఈ కార్యక్రమంలో బిజెపి అల్లవరం మండల కోశాధికారి గుడాల పుల్లయ్య శెట్టి మండల ఉపాధ్యక్షులు కుడిపూడి దుర్గాప్రసాద్ గోనేమడతల రవికుమార్ వీర్నాల రమణ బాబు మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు