

శంకరపట్నం జనవరి 27 జనం న్యూస్ శంకరపట్నం మండలం కొత్తగట్టు శ్రీ మత్స్య గిరింద్ర స్వామి కళ్యాణ మండపాన్ని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ,ఆలయ చైర్మన్ ఉప్పుగళ్ల మల్లారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు.ఆలయ పురోహితులు శేషం మురళీధరచార్యులు పూర్ణకుంభంతో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు స్వాగతం పలుకుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం కళ్యాణ మండపంలో శ్రీ మత్స్య గిరింద్ర స్వామి పంచాహ్మిక బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మత్స్యవతారంలో స్వయంభుగా వెలసిన క్షేత్రాలు అత్యంత అరుదు అన్నారు.తెలంగాణలో ఏకైక మత్స్యవతార వేద నారాయణస్వామి ఆలయం మన నియోజకవర్గంలో ఉండడం అదృష్టం అన్నారు. సిజిఎఫ్ నిధులతో రూ.36.30లక్షలతో, దాతలతో సహకారంతో కళ్యాణ మండపాన్ని తీర్చిదిద్దిన ఆలయ చైర్మన్,డైరెక్టర్లకు,సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మల్లారెడ్డి మాట్లాడుతూ ఫిబ్రవరి 4వ తేదీ నుండి స్వామి వారి జాతర ప్రారంభమై ఫిబ్రవరి 19 ముగుస్తుందన్నారు.శ్రీ మత్స్యగిరింద్ర స్వామి బ్రహ్మోత్సవాలలో భక్తులకు అన్ని వసతులు కల్పించామన్నారు.స్వామి వారి జాతరకు తెలంగాణ నాలుగు మూలల నుండి అధిక మొత్తంలో భక్తులు హాజరవుతారు అన్నారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు బసవయ్య,టిపిసి సభ్యులు శ్రీనివాస్, హుజురాబాద్ మార్కెట్ వైస్ చైర్మన్ నాంపల్లి తిరుపతి,ఆలయ డైరెక్టర్లు,జిల్లా, నియోజకవర్గ,మండల,వివిధ గ్రామాల నాయకులు,మాజీ ప్రజాప్రతినిధులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.