

జుక్కల్ ఆగస్టు 23 జనం న్యూస్
పవిత్ర శ్రావణ మాసం చివరి శనివారం సందర్భంగా జుక్కల్ ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీ కాంతారావు గారి సతీమణి శ్రీమతి తోట అర్చన గారు ఈరోజు పిట్లం మండలం చిన్న కొడప్గల్ గ్రామంలో శ్రీ రామేశ్వర ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.. ఆలయ అర్చకులు శ్రీమతి తోట అర్చన గారికి వేద మంత్రాలతో ఆశీర్వచనాలు అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.. జుక్కల్ నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలు, పాడి పంటలు,సుఖ సంతోషాలతో జీవించాలని ఆ పరమ శివుడిని ప్రార్థించినట్లు అర్చన గారు తెలిపారు..
