

జనం న్యూస్ ఆగష్టు 24(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ )-
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిలకు 42శాతం రిజర్వేషన్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 25న ఆర్ కృష్ణన్న ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద సత్యాగ్రహ దీక్ష చేపట్టనున్నట్టు బీసీ యువజన సంఘం కోదాడ నియోజకవర్గం అధ్యక్షులు గడ్డం లక్ష్మీనారాయణ యాదవ్ తెలిపారు. మునగాల మండల కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశపరిచి,బిసి రిజర్వేషన్ల అమలుకు ప్రత్యా మ్నాయ నిర్ణయం తీసుకోవాలని కోరారు.రాష్ట్ర ప్రభుత్వం తన అధికారాన్ని ఉపయోగించి, రాజ్యాంగంలోని 246 డి6 టి6 ప్రకారం స్థానిక సంస్థల్లో బిసి రిజర్వేషన్లను పెంపునకు జీవో జారీ చేయాలని డిమాండ్ చేశారు..రాజకీయ పార్టీలు సిద్ధాంతపరమైన విభేదాలతో వాస్తవాలు మాట్లాడ కుండా రాజకీయ ఘర్షణ వైఖరితో కేంద్రాన్ని విమర్శిస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఇది సరికాదన్నారు.రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన రెండు బిసి బిల్లులు గవర్నర్ ఆమోదించడం కానీ, తిరస్కరించడం కానీ చేయలేదన్నారు. కోర్టులు కూడా బిసి రిజర్వేషన్కు వ్యతిరేకంగా ఉన్నాయనే వాదన కూడా వినపడుతుందని, అలా అయితే, దీనిపై న్యాయ పోరాటం చేయాల్సిందేనన్నారు. 42శాతం బిసి రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్ని కలు నిర్వహించనిపక్షంలో యుద్ధం తప్పదని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో అమరగాని వంశీ, మండవ వీరబాబు, రెస్ సైదులు బీసీ నాయకులూ తదితరులు పాల్గోన్నారు