Listen to this article

జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఆగస్టు 23

తర్లుపాడు మండలం జగన్నాధపురం గ్రామం లో గల ప్రాధమికపాఠశాలలో మహనీయుడు స్వాతంత్ర సమరయోధుడు ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశంపంతులు జయంతి వేడుకలు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కశెట్టి జగన్ బాబు ఘనంగా నిర్వహించారు తోలుతగా ఆయన చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు అనంతరం స్వాతంత్ర పోరాటం లో అయన పాత్ర గురించి, అయన చేసిన చేవల గురించి విద్యార్థులకు తెలియజేసారు