జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 25 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955
కాలువల్లో నీళ్ల సెట్టింగులు వేసి జగన్ ప్రజల్ని మోసగిస్తే, చంద్రబాబు ఇచ్చిన మాటకు కట్టుబడి కృష్ణా జలాలు పారించి జనం మనసులు గెలిచారు.
సంక్షేమం పేరుతో జగన్ రాష్ట్రాన్నే ఊడ్చేశాడు.
పట్టణంలో రూ.1.22కోట్లతో నిర్మించే నూతన చేపలమార్కెట్, మాంసం మార్కెట్ దుకాణ సముదాయానికి శంఖుస్థాపన చేసిన మాజీమంత్రి.
3 నెలల్లో దుకాణ సముదాయం నిర్మించి, వ్యాపారులకు అప్పగించాలని అధికారుల్ని ఆదేశించిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి
ప్రజలకు మంచి చేయడంలో ముఖ్యమంత్రి పట్టువదలని విక్రమార్కుడని, హంద్రీనీవా ద్వారా కృష్ణా నీటిని కుప్పానికి తరలించిన ఆయన సంకల్పంతో, ఆ ప్రాంత ప్రజలు.. రైతుల సంతోషానికి అవధుల్లేవని జీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. పట్టణంలోని కూరగాయల మార్కెట్ పక్కన నూతన చేపల మార్కెట్, మాంసం మార్కెట్ల దుకాణ సముదాయం నిర్మాణానికి సోమవారం ఆయన శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వ్యాపారులు, స్థానికుల్ని ఉద్దేశించి ప్రత్తిపాటి మాట్లాడారు. 3 నెలల్లో దుకాణసముదాయ నిర్మాణం పూర్తికావాలి పట్టణాభివృద్ధికి అవసరమైన నిధులు అందించడంలో కూటమిప్రభుత్వం ఉదారంగా వ్యవహరిస్తోందని, ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనుల విషయంలో అధికార యంత్రాంగం వేగంగా స్పందించాలని ప్రత్తిపాటి సూచించారు. రూ.1.22 కోట్లతో చేపట్టిన నూతన చేపల, మాంసం మార్కెట్ సముదాయం నిర్మాణ పనులు 3 నెలల్లో పూర్తిచేయాలని, పనులకు సంబంధించిన ప్రగతిని ప్రతినెలా తనకు తెలియచేయాలని ప్రత్తిపాటి స్థానిక మున్సిపల్ డీఈ రహీంని ఆదేశించారు. పనుల్లో నాణ్యత లోపించినా, సకాలంలో పూర్తి అవ్వకపోయినా, అధికారులే బాధ్యులవుతారని ప్రత్తిపాటి స్పష్టంచేశారు. దుకాణాలు నిర్మించి తమకు అప్పగించాక వ్యాపారులు వాటిని జాగ్రత్తగా వినియోగించుకోవాలని, రోడ్లపై వ్యర్థాలు, ట్రాఫిక్ సమస్యలతో ప్రజలకు ఇబ్బందులు లేకుండా వ్యాపారం చేసుకోవాలని ప్రత్తిపాటి సూచించారు.సంక్షేమం పేరుతో.. జగన్ రాష్ట్రాన్నే ఊడ్చేశాడు గతంలో హంద్రీనీవా కాలువలో నీళ్ల సెట్టింగ్ వేసిన జగన్ నాడు ప్రజల్ని మోసగించి, తన పబ్బం గడుపుకున్నాడన్న ప్రత్తిపాటి. నేడు చంద్రబాబు పట్టుదలతో నీటిని తరలించి తన ప్రాంత ప్రజల కష్టాలు తీర్చాడన్నారు. సినిమావాళ్ల మాదిరి సెట్టింగులు వేసి జనాన్ని మోసగించిన నాడే జగన్ బండారం బయటపడిందని, ఆయన పనితనం కేవలం మాటలకే పరిమితమని ప్రత్తిపాటి ఎద్దేవాచేశారు. బటన్ నొక్కుడు పేరుతో ప్రజలకు పావలా ఇచ్చిన జగన్, సంక్షేమం పేరుతో తన అవినీతి మీడియాలో అంతకు పదింతలు ఊదరగొట్టించుకొని, చివరకు రాష్ట్రాన్నే ఊడ్చేశాడని ప్రత్తిపాటి చెప్పారు. మహిళలు, రైతులు, యువత, విద్యార్థులు సహా అన్ని వర్గాల ప్రజలఆలోచనలు పసిగడుతూ, సంక్షేమ పథకాల్లో కూడా నూతనవిధానాలు ప్రవేశపెట్టడం చంద్రబాబుకే సాధ్యమైందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ టీడీపీ కరీముల్లా, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు పఠాన్ సమాధ్ ఖాన్, మద్దుమల రవి, రాష్ట్ర డైరెక్టర్ కందుల రమణ, వార్డు కౌన్సిలర్లు, నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు


