జనం న్యూస్ ఆగస్టు 25 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
ముమ్మిడివరం మండలం అనాతవరం గ్రామంలో సమరసత సేవా ఫౌండేషన్ ముమ్మిడివరం మండల సహ కన్వీనర్ నల్లా ఆండాళ్ దేవి ఆధ్వర్యంలో మట్టి గణపతి మహా గణపతి పర్యావరణం పరిరక్షణలో భాగంగా గణపతి నవరాత్రులలో మట్టి గణపతిని పూజించాలని మట్టి ప్రతిమలను ధార్మిక సమితి సభ్యులు తయారు చేసి ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు గోలకోటి వెంకటరెడ్డి గ్రంధి నానాజీ మట్ట సూరిబాబు ముమ్మిడివరం సబ్ డివిజన్ ధర్మ ప్రచారక్ బొంతు కనకారావు వేటుకూరి పుష్ప కుడుపూడి మహాలక్ష్మి కైరం జ్యోతి కేతా రామకృష్ణ కొప్పిశెట్టి నాగకీర్తి బొంతు గంగాభవాని తదితరులు పాల్గొన్నారు.



