Listen to this article

ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం జనం న్యూస్ రిపోర్టర్ ఠాగూర్ ఆగస్టు 25 :

సీపీఐ, రైతు సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు . ఈ సందర్భంగా సీపీఐ మండల కార్యదర్శి జాగర్లమూడి రంజిత్ కుమార్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు అమరనేని వీరభద్రమ్ మాట్లాడుతూ రైతుల పంటలకు వేయవల్సిన యూరియా ఎరువులు సక్రమంగా పంపిణీ చేయకపోవడంతో రెైతులు దుకాణాలు, సొసైటీ ల వద్ద లైన్లో గంటల కొద్దీ నిలబడాల్సి వస్తుంది.రైతులకు ఇచ్చే యూరియా సరిపోను కాకుండా సిలింగ్ పెట్టడం వల్ల రైతులు ఇబ్బందులను ఎదుర్కుంటున్నారని, రెైతులు పొలాల్లో పని చేసుకోలేకా, యూరియా కోసం లైన్లో నిలబడలేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటున్నారని వాపోయారు.ప్రభుత్వాలు రైతులకు సరిపడ ఎరువులను ఏంటనే సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా రైతులు వేసిన పంటలకు రైతు భీమా అమలు చేయాలని కోరారు. రైతు భీమా అమలు చేయకపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారని అతివృష్టి, అనావృష్టి వాళ్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వెంటనే రైతు భీమా అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్ శేషగిరి రావు మరియు మండల వ్యవసాయ అధికారి నరసింహ రావు కి వినతిపత్రం అందజేశారు.వారు మాట్లాడుతూ రైతులు ఇబ్బందులూ ప్రభుత్వానికి తెలియజేసి పరిష్కారమే అయ్యే లాగా చూస్తామన్నారు. ఈ కార్యక్రమం లో మండల సీపీఐ సహాయ కార్యదర్శి బాణోత్ రాంబాబు, మండల నాయకులు మదినేని వెంకన్న, రమేష్, బొగిన బోయిన నాగేశ్వరావు,వేముల చిన్న రెడ్డి, ఇర్ప సురేష్,మాదినేని నరసింహ రావు, రాజశేఖర్ రెడ్డి, ఉపేందర్ రావు,తదితరులు పాల్గొన్నారు.