జనం న్యూస్ ;25 ఆగస్టు సోమవారం;
సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్: సిద్దిపేట పట్టణంలోని నలంద విద్యాలయం ఆధ్వర్యంలో ఈరోజు మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమం జరిగింది. పర్యావరణ కాలుష్యం తగ్గించడానికి మట్టి గణపతి విగ్రహాలను వినియోగించాలని ఆకాంక్షిస్తూ, శ్రీ మొరంశెట్టి రాములు ఈ విగ్రహాలను అందజేశారు.
ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మట్టి గణపతుల ప్రాముఖ్యతను తెలియజేస్తూ పాఠశాల అధినేత హరినాథ్ ప్రసంగించారు.


