Listen to this article

జనం న్యూస్ 26 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

విజయనగరం యూత్ ఫౌండేషన్ మరియు విజయ దుర్గ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ వారి కార్యాలయంలో పర్యావరణ కాపాడుదాం మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం అను వాల్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో పర్యావరణ పరి రక్షణ కు మట్టి వినాయక విగ్రహాలు మాత్రమే తప్పనిసరిగా పూజించాలని కలెక్టర్ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ పేర్కొన్నారు ఈ సందర్భంగా విజయనగరం యూత్ ఫౌండేషన్ అధ్యక్షులు షేక్. ఇల్తామాష్
మాట్లాడుతూ జల కాలుష్యం వలన క్యాన్సర్, ఊపిరి తిత్తుల తదితర ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశముంది కావున అందరూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బొమ్మలను వాడ వద్దని కోరారు. విజయ దుర్గ ఫౌండేషన్ అధ్యక్షులు కేశవపట్నం చంద్రిక ప్లాస్టర్ ఆఫ్ పారిస్ బొమ్మలను వాడడం పర్యావరణానికి హానికరం అని తెలియజేశారు.*