Listen to this article

బిచ్కుంద ఆగస్టు 26 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం శేట్లూర్ ప్రాథమిక పాఠశాలలో నిన్న మధ్యాహ్న భోజన పథకంలో జరిగినటువంటి ఫుడ్ పాయిజన్ పిల్లలను పరామర్శించడం జరిగినది. అదేవిధంగా బిచ్కుంద ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శెట్లుర్ గ్రామ విద్యార్థులు మధ్యాహ్నం ఆహార పథకంలో అస్వస్థకు గురి అవ్వడం అయిన విద్యార్థులను మార్కెట్ కమిటీ చైర్మన్ కవిత ప్రభాకర్ రెడ్డి వారితో కలిసి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని డాక్టర్ గారి‌కి మాట్లాడడం జరిగినది ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నాగనాథ్ పటేల్ , దడిగి నాగనాథ్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శంకర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ అజయ్ పటేల్ సాయిని అశోక్ ,గుండె కల్లూరు మాజీ ఎంపిటిసి రాజు పటేల్ , కల్లాలి హనుమంతరావు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు*