Listen to this article

జనం న్యూస్ //జనవరి 28//కుమార్ యాదవ్.. వినవంక మండలానికి చెందిన శ్రీలత.. డిప్యూటీ తహసిల్దార్ గా చందుర్తి మండలం లోని కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు. గణతంత్ర దినోత్సవం రోజున పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన వేడుకల్లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహజాన్ చేతుల మీదుగా ఉత్తమ సేవా అవార్డు ప్రశంస పత్రం అందుకున్నారు.ఈ స్ఫూర్తితో మరింత సేవ చేయాలని సూచించారు. ఉత్తమ సేవ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని వీణవంక మండల ప్రజలు చాలా ఆనందం వ్యక్తం చేశారు.ఇంకా ఎంతో గొప్ప స్థాయికి వెళ్లాలని పేర్కొన్నారు.