జనం న్యూస్ ఆగస్టు 28కాట్రేనికోన
సారథ్యం కార్యక్రమానికి కాకినాడ విచ్చేసి అన్నమ్మగాటి సెంటర్లో నాయకర్ గారి కాంస్య విగ్రహానికి గజమాల వేసి సారథ్యం కార్యక్రమాన్ని ప్రారంభించిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌ,,పివియన్ మాధవ్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి దుశ్శాలువా, తో బిజెపి నాయకులు విశ్వనాథపల్లి శ్రీనివాసరాజు శ్రీమతి ఉమామహేశ్వరి, చెక్కా అజయ్ వర్మ సత్కరించడం జరిగింది.. అనంతరం…నాయకర్ జిల్లా సాధన సమితి తో కలిసి జిల్లాకు మల్లాడి సత్యలింగం నాయకర్ కాకినాడ జిల్లాగా నామకరణం చేయాలని వినతిపత్రం నాయకర్ గారి చిత్రపటం, అందించడం జరిగింది…అనంతరం మాధవ్ మాట్లాడుతూ….మల్లాడి సత్యలింగం నాయకర్ గారు ఎంఎస్ఎన్ చారిటీస్ స్థాపించి రాష్ట్రంలో మొదటి సాంకేతిక కళాశాల పాలిటెక్నిక్ స్థాపించి అనేక మంది ఇంజినీర్స్ ని తయారు చేయడం తో పాటు అనేక కళాశాలలను ప్రారంభించడంతో పాటు విద్య వసతి భోజనం విదేశాల్లో చదువుకోవడానికి అనేకమందికి ప్రోత్సాహాన్ని అందించడం ప్రముఖ శాస్త్రవేత్త ఎల్లాప్రగడ సుబ్బారావు ఆ స్థాయికి ఎదగడానికి ప్రోత్సాహాన్ని అందించింది కూడా వారే… అంతేకాకుండా అనేక దేవాలయాలు, వేద పాఠశాల నిర్మాణం చేసి ఆధ్యాత్మిక సామాజిక చైతన్యం కోసం యావదాస్తిని సమాజ సంక్షేమం కోసం.. ఖర్చు చేసిన మహనీయులు అందుకే వారికి గజమాలను వేసి నివాళులర్పించి సారథ్యం కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అని తెలియజేశారు…. మల్లాడి సత్యలింగం నాయకర్ జిల్లా సాధన సమితి అధ్యక్షులు వైదాడి నూకరాజు.. బిజెపి నాయకులు కొక్కిలిగడ్డ గంగరాజు మచ్చ శివప్రసాద్ కోపనాతి దత్తాత్రేయ వర్మ శ్రీ మల్లాడి సత్యలింగం నాయకర్ జిల్లా నామకరణ సాధన సమితి అధ్యక్షులు పెమ్మాడి శ్రీను కోలా మీరయ్య కాలాడి శివ దున్న జాన్ కామేశ్వరరావు పాలెపు సత్తిబాబు… తదితరులు పాల్గొన్నారు…


