Listen to this article

జనం న్యూస్ జనవరి 28 శాయంపేట మండల కేంద్రంలోని ఎస్ వి కే కే ఫంక్షన్ హాల్ లో బీసీ కమిటీ ఎన్నిక ఏర్పాటు చేశారు దాసు సురేష్ బీసీ రాష్ట్ర అధ్యక్షులు పిలుపుమేరకు బీసీ రాజ్యాధికార రాష్ట్ర వ్యవస్థాపక నాయకుడు దామరకొండ కొమురయ్య ఆధ్వర్యంలో శాయంపేట మండలంలో బీసీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ముంజాల రాజేందర్ గౌడ్ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు ఏరుకొండ హైమావతి హన్మకొండ జిల్లా ఇన్చార్జి గోవిందుల జనార్దన్ పాల్గొని బీసీ రాజాధికార సమితి తరపున శాయంపేట మండల కమిటీని ఎన్నుకోవడం జరిగింది. బీసీ మండల అధ్యక్షులు ఉప్పు నరసయ్య ఉపాధ్యక్షులు కూల శ్రీను మాడిశెట్టి చిరంజీవి మండల ప్రధాన కార్యదర్శి అడప ప్రభాకర్ అధికార ప్రతినిధి నూనె శ్రీనివాస్ గౌరవ అధ్యక్షులు చేరాల రాకేష్ యూత్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ పాల్గొని ఎన్నుకున్నారు ఈ సమావేశంలో బీసీలకు స్వతంత్రం వచ్చిన కానుంచి రాజ్యాధికారాన్ని కోల్పోతున్నారు 60 శాతం ఉన్న బీసీ జనాభా 130 కులాల బీసీ కులవృత్తులు రాజ్యాధికారంలో రిజర్వేషన్లు అన్యాయం జరుగుతూ ఉంది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వలన బీసీ కులాలకు బీసీ విద్యార్థులకు నిరుద్యోగులకు పొట్టన కొట్టి అన్యాయం చేస్తున్నారు. ఈడబ్ల్యూఎస్ రద్దు చేయాలి. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బీసీ పక్షాన ఒక పులిబిడ్డలా పోరాడుతున్నాడు తీన్మార్ మల్లన్న లాగా బీసీ ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు ప్రతిపక్ష పార్టీలు నాయకులు పోరాటం చేయాలి. ఫిబ్రవరి 2వ వరంగల్ లో జరిగే ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్లో బీసీ గర్జన ను విజయవంతం చేయాలి నీ పిలుపునిస్తున్నాం. ఇప్పటికైనా బీసీ కులాలు అనే బీసీ నాయకులందరూ ఏకమై బీసీ రాజ్యాధికారం కోసానికి పోరాటం చేయాలని పిలుపునిస్తున్నాం. బీసీ రాజ్యాధికార లక్షయమే బీసీ రాజ్యాధికార నీకై కోసం పోరాటం చేస్తున్నాం. రాబోయే రోజులలో బీసీ రాజకీయ పార్టీ స్థాపించబోతున్నాం. మన బీసీ ఓటు బీసీ పార్టీకే వేసుకుని రాజ్యాధికారం సాధించుకోవాలని చేసుకోవాలని ప్రజలకు పిలుపునిస్తున్నాం. తెలిపారు….