Listen to this article

జనం న్యూస్- ఆగస్టు 28- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్-

అంతర్జాతీయ పర్యాటక కేంద్రం నాగార్జునసాగర్ ను బుధవారం నాడు 23 దేశాలకు చెందిన 27 మంది ప్రతినిధులు సందర్శించారు. నేపాల్ శ్రీలంక, రష్యా, వియత్నాం ,జింబాబ్వే, నైజీరియా, ఎతోపియా, సౌత్ సూడాన్, టాన్జేనియా, జమైకా, జోర్డాన్ మొదలగు 23 దేశాల ప్రతినిధులు ఈ నెల 15వ తేదీ నుండి హైదరాబాదులోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ లో వీరు వివిధ రంగాలలో నూతన ఆవిష్కరణలు అభివృద్ధి అనే అంశంపై శిక్షణ పొందుతున్నారు. ఈ నెల 30వ తేదీతో ఈ శిక్షణ ముగియనుంది. ఈ శిక్షణలో భాగంగా బుధవారం నాడు టీం కోఆర్డినేటర్ డాక్టర్ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో నాగార్జునసాగర్ ను సందర్శించారు. సాగర్ సందర్శనలో భాగంగా నాగార్జునకొండ ను చేరుకొని అక్కడ పురావస్తు మ్యూజియాన్ని, మాన్యుమెంట్స్ ను సందర్శించారు. అనంతరం నాగార్జునసాగర్ ప్రధాన డ్యామ్ ను, నాగార్జునసాగర్ లో తెలంగాణ టూరిజం నిర్మించిన బుద్ధవనాన్ని సందర్శించారు. బుద్ధ వనం వివరాలకు సంబంధించిన వీడియోని వీక్షించిన అనంతరం మహా స్తూపం లోని ధ్యాన మందిరంలో ధ్యానం చేశారు అనంతరం బుద్ధ చరిత వనం, ధ్యానవనం, స్థూప వనాలను సందర్శించారు. వీరికి స్థానిక టూరిజం గైడు సత్యనారాయణ నాగర్జున కొండ చారిత్రక విశేషాలను, నాగార్జునసాగర్ ప్రాజెక్టు వివరాలను, బుద్ధవనం విశేషాలను వివరించారు. వీరితోపాటు డి ఆర్ డి ఎ పి డి శేఖర్ రెడ్డి, పెద్దవూర తాసిల్దార్ రఘు, సాగర్ సిఐ శ్రీను నాయక్, సాగర్ డ్యాం ఈ ఈ,,నాగేశ్వరరావు,ఎ ఇ కృష్ణయ్య బుద్ధవనం అధికారులు శాసన, రవిచంద్ర, రెవెన్యూ ప్రోటోకాల్ ఆఫీసర్ దండా శ్రీనివాస్ రెడ్డి, సాగర్ ఎస్ ఐ ముత్తయ్య, ఎస్ పి ఎఫ్ ఎస్ ఐ రఘు తదితరులు ఉన్నారు.