

▪స్వాగతిస్తే లగ్గం డప్పు కొడతాం
▪ కళా మండలి జిల్లా అధ్యక్షులు ప్రభు కళామండలి జిల్లా ఉపాధ్యక్షులు శ్రీరామ్..
▪ జిల్లా మహిళా డప్పు కళా మండలి అధ్యక్షురాలిగా నక్క జ్యోతి..
ప్రధాన కార్యదర్శిగా భావానీ..
జనం న్యూస్ //జనవరి 28//జమ్మికుంట //కుమార్ యాదవ్..
ఫిబ్రవరి 7 న ఎస్సీ వర్గీకరణ సాధన కై ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ తలపెట్టిన వేయి గొంతులు లక్ష డప్పుల మహా కళా ప్రదర్శన కరీంనగర్ జిల్లా మహిళా డప్పు కళా మండలి అధ్యక్షురాలిగా నక్క జ్యోతిని రాష్ట్ర కోఆర్డినేటర్, ఉమ్మడి కరీంనగర్ ఇన్చార్జి రామంచ భరత్ ఆదేశాల మేరకు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందిఅదేవిధంగా జిల్లా ఉపాధ్యక్షురాలుగా భాగ్యలక్ష్మి డప్పు రాధ, దేవునూరి సమ్మక్క కాసర్ల సంధ్య శైలజసహాయ కార్యదర్శులుగా కళ ,కమల పూలమ్మ, సమ్మక్క, రాజేశ్వరి, సభ్యురాలుగా వజ్రమ్మ, సుగుణ, పావని, స్వరూప, లలిత, పల్లె రమామంజుల కొంకటి రమక్క నుఎన్నుకోవడంఅభినందనీయమని అన్నారు.ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేశారుఈ సందర్భంగాకళామండలి జిల్లా అధ్యక్షులు అంబాల ప్రభాకర్ ( ప్రభు) మాట్లాడుతూ.. మందకృష్ణ మాదిగ ఎస్సీ వర్గీకరణ కోసం 30 సంవత్సరాలుగా సుదీర్ఘ పోరాటం చేయగా ఆగస్టు 1 న సుప్రీం కోర్టు 7 జడ్జీల ధర్మాసనం ఎస్సీ వర్గీకరణ న్యాయమైన డిమాండ్ అని వర్గీకరణ చేయడం ద్వారా వారి వారి జనాభా నిష్పత్తి ప్రకారం 59 కులాలకు సమన్యాయం జరుగుతుందని తీర్పు ఇవ్వడంతో సంపన్న మాలలు అడ్డుకునే ప్రయత్నం
చేస్తున్నారని, వారి కుట్రలను ఈ ప్రపంచానికి డప్పు , పాట ద్వారా తెలియచేయాలని ఉద్దేశంతో మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారనీ30 సంవత్సరాల పాటు సుదీర్ఘ పోరాటం చేశానని, 30 రోజులు కవులు, కళాకారులు, డప్పు కళాకారులు, గాయకుల పాత్రకీలకమని తెలిపారని అన్నారు.సుప్రీంకోర్టు తీర్పు రాగానే దేశంలో నే మొదటగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఎస్సీ వర్గీకరణ చేస్తామని తెలిపి ఇప్పుడు మాలలకు తలోగ్గి జాప్యం చేస్తున్నారని తెలిపారు.
ఫిబ్రవరి 7లోపే ఎస్సీ వర్గీకరణ పై రేవంత్ రెడ్డి సర్కార్ స్పష్టత తెలియజేయాలని కోరారు.
ఎస్సీ వర్గీకరణ కు అడ్డుపడ్డ వాళ్లకు చావు డప్పు, స్వాగతించే వారికి లగ్గం డప్పు కొడతామని తెలియజేశారుఅందులో భాగంగానే కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి మహిళ డప్పు కళా నాయకులతో సమావేశమై ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు.ఈ కళా నాయకురాల్లతో పురుషుల డప్పు కళాకారులకు దీటుగా ఫిబ్రవరి 7న హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై లక్ష డప్పులు వేల గొంతులు మహా కళా ప్రదర్శనలకు వేలాది మంది మహిళా డప్పుకళాకారులచేప్రత్యేక డప్పు, దరువు ఆకర్షణీయంగా ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా కళామండలి ఉపాధ్యక్షులు అంబాల శ్రీరామ్, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు వీణవంక మండలం కళామండలి అధ్యక్షులు అంబాల మధునయ్య తదితరులు పాల్గొన్నారు.