

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 27 రిపోర్టర్ సలికినిడి నాగరాజు:- కష్టాల్లో ఉన్న వారిని నిస్వార్థంగా ఆదుకునే మానవతావాది.. రాజకీయాల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను పాటించే వ్యక్తి మండలనేని చరణ్‌తేజ అని పలువురు కొనియాడారు. పట్టణానికి చెందిన అన్నపరెడ్డి మల్లేశ్వరమ్మ కడుపులోని సీము గడ్డ ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల వైద్య ఖర్చులకు రూ. 3 లక్షల20వేలు వెచ్చించారు. ఈ సమాచారం తెలుసుకున్న జనసేన యువనాయకుడు మండలనేని చరణ్‌తేజ ఆమె వైద్య ఖర్చుల కోసం తన ప్రతినిధులతో ఆర్ధిక సహాయం అందించారు. ఈ సందర్బంగా పలువురు మాట్లాడుతూ ‘అందరినీ ఒకే కుటుంబంగా భావిస్తూ కష్టాల్లో ఉన్న వారిని ఆదుకునే గుణం కలిగిన చరణ్‌తేజ గతంలోనూ అత్యవసర పరిస్థితుల్లో దాతృత్యాన్ని చాటు కున్నారని ప్రశంసించారు. పేద ప్రజల పాలిట పెన్నిధిగా, నమ్ముకున్న వారి కోసం ఎంతకైనా తెగించే తత్త్వం గల చరణ్‌తేజ, కష్టం అంటూ తలుపు తడితే కులం,మతం, పార్టీలకతీతంగా ఆదుకునే ఆపద్బాంధవుడని వెల్లడించారు,ఈ కార్యక్రమంలో పాల్గొన్న లంకా రమణమ్మ జనసేన పార్టీ వీర మహిళ ఎస్.కె హసినా, మరియు షర్మిల,అన్నపరెడ్డి నాగరాజు,మీసాల లక్ష్మీనారాయణ అజీస్, తదితరులు
పాల్గొన్నారు.